ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cycle_Yatra_for_CBN

ETV Bharat / videos

Cycle Yatra for CBN : చంద్రబాబుకు మద్దతుగా మాజీ సర్పంచ్ బృందం.. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర - రాజమండ్రి లోకల్ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 10:37 AM IST

Cycle Yatra for CBN : టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి కుప్పం వరకూ సైకిల్‌ యాత్ర చేపట్టిన కొందరు కార్యకర్తలు రాజమహేంద్రవరంలో భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు.  చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. శ్రీకాకుళానికి చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణ సహా మరో నలుగురు పార్టీ కార్యకర్తలు అక్టోబరు 2న శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకు సగటున 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ.. సోమవారం రాజమహేంద్రవరం చేరుకున్నారు.  

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిశారు. సైకిల్ యాత్రికులతో భువనేశ్వరి ఆత్మీయంగా మాట్లాడారు. అందరి అభిమానమే కొండంత అండ అని.. అదే తమకు ధైర్యమని చెప్పినట్లు సైకిల్ యాత్రికులు చెప్పారు. అలానే యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారని యాత్రికులు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సంక్షేమం కోసం పోరాడే యోధుడ్ని నాలుగు గోడల మధ్య నిర్బంధించడం సరికాదని అన్నారు. అందుకే అధినేత ఆశయాలను ప్రజలకు వివరించాలని.. అతని కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపాలనే ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

...view details