ఆంధ్రప్రదేశ్

andhra pradesh

current_bill_shock_in_satya_sai_district

ETV Bharat / videos

బాబోయ్​ కరెంటు బిల్​.. ముట్టుకోకుండానే షాక్​ - పుట్టపర్తి తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 7:23 PM IST

Current Bill Shock in Satya Sai District : విద్యుత్​ బిల్లులు ముట్టుకోకుండానే షాక్​ కొడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో మణి అనే మహిళ ఇంటికి వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. గత కొన్ని నెలలుగా విద్యుత్​ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. అద్దె ఇంట్లో జీవిస్తున్నానని.. ఈసారి ఏకంగా 43వేల 516 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం అని.. వేల రూపాయల కరెంటు బిల్లు ఎలా కట్టగలనని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇంత కరెంటు బిల్లు చూడలేదని.. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఘోరంగా విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయన్నారు. ఎన్నిసార్లు విద్యుత్ కార్యాలయానికి సంప్రదించినప్పటికీ.. న్యాయం జరగలేదంటూ ఆవేదన చెందారు. 

Current Bill in Thousands in Puttaparty :ఒకేసారి దాదాపు అర లక్ష కరెంటు బిల్లు చూసి షాక్​ అయ్యామన్నారు. నాలుగు సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నామన్నారు. గత కొన్ని నెలలుగా అద్దెకుంటున్న ఇంటికి కరెంటు బిల్లు పెరుగుతుండటం గమనిస్తున్నామన్నారు. విద్యుత్​ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయిందని... ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.  

ABOUT THE AUTHOR

...view details