ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dosa_Farmer_in_Losses

ETV Bharat / videos

Cucumber Farmer in Loss: గిట్టుబాటు ధరలేక నష్టాల్లో దోస రైతు.. పంటను కోయకుండా పొలంలోనే వదిలేసిన వైనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 12:24 PM IST

Cucumber Farmer in Loss: ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్​లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఓ రైతు తన పంటను పొలంలోనే వదిలేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చోటు చేసుకుంది. జిల్లాలోని మోపిడి గ్రామానికి చెందిన జగన్నాథ్ అనే ఓ రైతు కోనాపురం సమీపంలో 7 ఎకరాల విస్తీర్ణంలో సాంబారు దోసను సాగు చేశాడు. పంట సాగు కోసం 3 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి ఆశాజనకంగా రావడంతో ఆ రైతు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. 

ఈ సాంబారు దోసను కర్ణాటకలోని మైసూరు, బెంగళూరులో అధికంగా కనుగోలు చేస్తారు. అయితే ఉన్నపళంగా పంట గిట్టుబాటు ధర పడిపోవటంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో పంటను కోయకుండా పొలంలోనే వదిలేశాడు. సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక అధికంగా నష్టపోయామని బాధిత రైతు జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారీగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాడు. 

ABOUT THE AUTHOR

...view details