ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CS_Jawahar_Reddy_Review_on_PM_Modi_Tirumala_Visit

ETV Bharat / videos

తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ - భద్రతా ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష 'ప్రధాని విడిది ఎక్కడంటే!' - CS Jawahar Reddy review on Modi Tirumala visit

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 7:49 PM IST

CS Jawahar Reddy Review on PM Modi Tirumala Visit: ఈ నెల 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటనపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ.. తిరుపతి రానున్న దృష్ట్యా అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు, బస తదితర అంశాలపై సీఎస్ అధికారులతో మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం వాయుసేన విమానంలో ప్రధాని తిరుపతి విమానాశ్రయం చేరుకుని.. తిరుమలలో రాత్రి బస చేస్తారు. ఆ రోజు రాత్రి ప్రధాని మోదీ తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమల బయల్దేరి వెళ్లే మార్గంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

PM Narendra Modi Tirumala Tour: మరుసటి రోజు 27వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని సీఎస్ వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో వీవీఐపీల పర్యటనల నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీ ఈవోకు తెలిపారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. 

ABOUT THE AUTHOR

...view details