ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Crowd in Yuvagalam Meeting at Gannavaram: గన్నవరంలో యువగళం గర్జన.. పోటెత్తిన పసుపు సైన్యం.. కిక్కిరిసిన సభా ప్రాంగణం - Yuvagalam Meeting

🎬 Watch Now: Feature Video

yuvagalam_meeting_crowd_in_gannavaram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 8:17 PM IST

Updated : Aug 23, 2023, 6:25 AM IST

Yuvagalam Meeting Crowd in Gannavaram: గన్నవరంలో యువగళం బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా తెలుగు తమ్ముళ్లతో కిక్కిరిసిపోయింది. దీంతో జాతీయ రహదారిపై నిలబడి ప్రజలు వీక్షించారు వేలాదిగా వచ్చిన టీడీపీ శేణులతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సభను టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు భారీగా ప్రజలు తరలివస్తారని ఘనంగా ఏర్పాట్లు చేశారు.  అంచనాలకు మించి ప్రజల నుంచి స్పందన రావటంతో.. వందలాది మంది ప్రజలు సభా ప్రాంగణం బయటే ఉండి పోయారు. ఎలా అయినా యువనేత లోకేశ్​ను చూడాలని, ప్రసంగం వినాలని జనం ప్రయత్నించారు. దీంతో సభా ప్రాంగణంతా పసుపుమయంగా మారిపోయింది. లోకేశ్.. చంద్రబాబు.. నినాదాలతో హోరెత్తింది. నారా లోకేశ్ సభా వేదికపైకి చేరుకునే సమయంలో.. కార్యకర్తలు ఉత్సాహంతో జై లోకేశ్.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. సభా వేదికపైకి చేరుకున్న లోకేశ్​.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.  

Last Updated : Aug 23, 2023, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details