ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crops Dying Due Power Cuts

ETV Bharat / videos

Crops Dying Due Power Cuts: 'ఎండిన పొలమే సాక్షి'.. విద్యుత్ కోతలతో గగ్గోలు పెడుతున్న రైతులు.. ప్రభుత్వంపై ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 7:58 PM IST

Crops Dying Due Power Cuts: వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజులుగా అప్రకటిత విద్యుత్‌ కోతలతో నీరందక వరి పంట ఎండిపోతోందని.. ఎండిపోయిన పొలంలో నిలబడి నిరసన తెలిపారు. ఆటంకాలు లేకుండా విద్యుత్‌ని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ.. వంగిమళ్ల గ్రామంలోని విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. 

అప్రకటిత విద్యుత్‌ కోతలపై విద్యుత్ ఉపకేంద్రం సిబ్బందిని నిలదీశారు. విద్యుత్తు సరఫరా చేయకపోవడంతోనే తమ పంటలు ఎండిపోతున్నాయని ఇలా అయితే తాము ఎలా పంటలను కాపాడుకోగలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. విద్యుత్‌ సక్రమంగా సరఫరా చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details