ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crops Drying Due to Lack of Irrigation in Srikakulam

ETV Bharat / videos

Crops Drying Due to Lack of Irrigation నీరులేక ఎండిన పంట.. ఆరుగాలం కష్టించిన రైతు కంట కన్నీరు..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 8:19 PM IST

Crops Drying Due to Lack of Irrigation in Srikakulam : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో సాగునీరు అందక 15 వేల ఎకరాల పంట పొలాలు ఎండిపోయాయి. మరికొన్ని తడులు నీరిస్తే పంట చేతికొచ్చేదని, కానీ కాలువల్లో పూడితీయకపోవడం వల్ల నీరందలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నేల పూర్తిగా నెర్రెలు బారిందని, పంటలు మొత్తం ఎండిపోయాయని రైతులు వాపోతున్నారు. అవకాశం ఉన్న కొందరు రైతులు మాత్రం డీజిల్ మోటార్లతో నీళ్లు పారిస్తూ, పొట్ట దశలో ఉన్న వరిపంటను కాపాడుకునేందుకు యాతన పడుతున్నారు. ఈ దుస్థితిని చూసిన తర్వాతైనా ప్రభుత్వం స్పందిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను తగినవిధంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Farmers Worried About Crop Loss : సాగునీరు అందక ఆమదాలవలస మండలం లో సుమారు 4000 ఎకరాల వరకు వరి పొలాలు ఎండిపోవడంతో చేతికిందే పంట నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు సుమారు పదిహేను వేలు వరకు ఖర్చు చేశామని పంట ఎండిపోవడంతో నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షాలు లేక మెరక పొలాలు కూడా ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details