ఆంధ్రప్రదేశ్

andhra pradesh

crop_movement_boats

ETV Bharat / videos

నీళ్లలో వరి పంట - అద్దె పడవ ద్వారా తరలిస్తున్న రైతులు - crop damage news in kakinada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 7:29 PM IST

Crop Movement by Boats :మిగ్​జాం తుపాను రైతు కంట కన్నీరు మిగిల్చింది. ఇందుకు నీట మునిగిన పొలాలు, రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నీట మునిగిన పంటను విడిచిపెట్టలేని ఓ రైతు పడవను అద్దెకు తీసుకొని ఒడ్డుకు చేరుస్తున్నాడు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నిదానందుడి గ్రామానికి చెందిన అబ్బులు అనే రైతు ఈ విన్నూత పద్ధతికి శ్రీకారం చుట్టారు.

Cyclone Effect in Kakinada District : మత్స్యాకారుల నుంచి రెండు చిన్నపాటి పడవలను అద్దెకు తెచ్చుకొని, నీట మునిగిన పంటను కూలీలతో కొయించి గట్టుకు చేరుస్తున్నాడు. ఇప్పటికే అబ్బులు ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి పెట్టారు. అద్దె పడవల ద్వారా పంటను తరలించేందుకు మరో రూ.10 వేలు అదనపు భారం తనపై పడుతుంది. ఇంత వరకు మత్స్యాకారులు ఉపయోగించిన పడవలను ఇప్పుడు పంటను తరలించడానికి రైతులు కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటకు పెట్టిన పెట్టుబడి రాకపోయిన అద్దె పడవల ద్వారా పండించిన పంటను తరలించడానికి అబ్బులు సిద్ధపడ్డారని స్థానికులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details