ఆంధ్రప్రదేశ్

andhra pradesh

crop_loss_ysr_district

ETV Bharat / videos

కడప జిల్లాలో ఎండిపోతున్న శనగ పంట - ప్రభుత్వం పరిహారం చెల్లించాలంటున్న రైతులు - వైఎస్సార్​ జిల్లాలో కరవు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 3:00 PM IST

Crop Loss in YSR District : వైఎస్సార్​ జిల్లాలో కరవు విలయ తాండవం చేస్తోంది. కమలాపురం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షానికి మినుము పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది పూర్తిగా పంటను దున్నేశారు. అప్పు చేసి పంటలు వేసుకున్న వారి పరిస్థితి దీనంగా తయారైందని రైతులు వాపోయారు.

Farmers Want the Government to Pay Compensation : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కమలాపురం, వల్లూరు మండలాల్లో వందల ఎకరాల్లో శనగ పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30 వేల రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడు పెట్టిన పెట్టుబడి రాకా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. నువ్వులు, మినుము పంట వేసిన రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని పేర్కొన్నారు. వందల ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ పంటలను పరిశీలించి పరిహారం చెల్లించాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details