ఆంధ్రప్రదేశ్

andhra pradesh

farmer_loss_due_to_selfish_leaders

ETV Bharat / videos

తుపానుతో కాదు -అధికార పార్టీ నేతల ధనదాహానికి బలయ్యాం: పర్చూరు రైతులు - అధికార పార్టీ నేతల మునిపోయామని రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 8:23 PM IST

Farmer Loss Due to Selfish Leaders : బాపట్ల జిల్లా పర్చూరులో అధికార పార్టీ నేతల ధనదాహానికి నిండా మునిపోయామని రైతులు వాపోతున్నారు. తుపాను ప్రభావం కన్నా వాగు కట్టతెగి తమకు అపార నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. మరమ్మతుల పేరుతో వాగులో మట్టి అక్రమంగా తరలించేశారని మండిపడ్డారు. పర్చూరు, కారంచేడు మండలాల్లో సాగు చేసిన వరి, మిరప, పొగాకు పూర్తిగా నీటమునిగిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు పాడైపోయాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Crop Loss in Bapatla District :తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని  టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్​ఛార్జీ ఎం. కొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు మిగ్​జాం తుపాను బాధితులకు సహాయం అందించటంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి చూపిస్తుందని చీరాల మండలం వాడరేవులో మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. వాడరేవులో 500 మంది ఉండగా కేవలం 50 మందికి మాత్రమే ప్రభుత్వం సహాయం అందించటాన్ని మత్స్యకారులు తప్పుపట్టారు.

ABOUT THE AUTHOR

...view details