తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలం లేదు - అధికారుల జాడ లేదు - కోనసీమ రైతుల కష్టాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 6:46 PM IST
Crop Damaged by Cyclone : మిగ్జాం తుపాను ముప్పు తప్పినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోనసీమ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వేలాది ఎకరాల్లో పంట పొలాలు ముంపులోనే ఉన్నాయి. అమలాపురం, అయినవిల్లి, పి.గన్నవరం, అంబాజీపేట, ముమ్మిడివరం, కొత్తపేట మండలాల్లో తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.
The Government Should Support the Farmers :తడిచిన వరి ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వడ్లు ఆరబెట్టుకునేందుకు స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు మొలకలు రావడం వల్ల వాటిని కొనేెందుకు ఎవరూ ముందుకు రారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించిన వాటిని కొనేందుకు ఒక్క అధికారి కూడా రాలేదని మండిపడుతున్నారు. ఒక్కో ఎకరాకు 30 వేల రూపాయల పెట్టుబడితో పాటు కౌలు చెల్లించామని రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల వరి చేలు మొత్తం నీట మునిగిపోయింది. ఈ కష్ట సమయంలో రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు.