ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crop_Damage_Due_to_Cyclone_Effect

ETV Bharat / videos

రైతులకు కన్నీటిని మిగిల్చిన తుపాను - పంట మెులకలు వచ్చే అవకాశం - ap Farmers lossed Michaung

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 5:16 PM IST

Crop Damage Due to Cyclone Effect: కోత దశలో ఉన్న పంట నీట మునిగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈదురు గాలులకు కొంత పంట నేలకు ఒరిగితే, మరికొంత పంట భారీ వర్షాలకు నీట మునిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా క్రాపచింతలపూడిలో రైతులు పంటను చూసి కన్నీరు కారుస్తున్నారు. పంట మెుత్తం మునిగిపోవడంతో ధాన్యపు గింజ కూడా దక్కదని రైతులు చెబుతున్నారు.

Michaung Left Loss to Farmers: పంటపై చాలా ఖర్చు పెట్టామని,పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లాగేసరికి 20-30రోజులు పడుతుందని ఈలోపు పంట మెులకలు వచ్చి కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. కోత కోసిన ధాన్యం రైతు భరోసా కేంద్రాల(RBK)కు తరలించేందుకు గోనె సంచులు, ధాన్యాన్ని కాపాడుకునేందుకు పరదాల పంపిణీలో ప్రభుత్వం అలసత్వం వహించిందని, ఇప్పటి దాకా అధికారులు ఎవరూ రాలేదని రైతులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details