చంద్రబాబు-ప్రశాంత్ కిషోర్ భేటీపై వైసీపీ నేతలు విమర్శలు - గట్టిగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు - allegations on Chandrababu PrashantKishore meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 11:05 AM IST
Criticism Between TDP and YCP Leaders on CBN and PK Meeting:తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాము ఛీ కొడితే బయటకి పోయిన వ్యక్తిని చంద్రబాబు బతిమిలాడి తెచ్చుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఒక పీకే ఉండగానే చంద్రబాబు మరో పీకేని తెచ్చుకున్నారని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వచ్చినా చేసేదేమీ లేదని మంత్రి జోగి రమేశ్ అన్నారు.
వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి వెనక పీకే ప్లాన్ ఉందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అతన్నే ఇంటికి తెచ్చుకున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రులు పెట్టిన పోస్టుల్ని టీడీపీ నేతలు తిప్పికొట్టారు. అంబటి పోస్టుకు స్పందిస్తూ 'బాబాయ్ హత్య', 'కోడికత్తి' వెనుక జగన్ వ్యూహం ఉందని ఆంగీకరించినందుకు ధన్యవాదాలు మంత్రి గారూ అంటూ మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.