ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ETV Bharat / videos

Cricket Betting Case: ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం - క్రికెట్ బెట్టింగ్ ముఠా న్యూస్

By

Published : May 30, 2023, 10:16 AM IST

Cricket Betting Case: శ్రీసత్యసాయి జిల్లాలో పెనుగొండ పోలీసులు.. ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్​ను నిర్వహిస్తున్నారు. పెనుగొండ కియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్​లో మోసపోయిన బాధితులు అందించిన ఫిర్యాదు మేరకు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై పెనుగొండ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 

ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మంది బెట్టింగ్ నిర్వాహకులు విజయవాడ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం. నిందితుల నుంచి పది లక్షల రూపాయలు నగదు, రెండు లాప్​టాప్​లు, 14 సెల్​ఫోన్లు, ఒక ఫార్చునర్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది నిందితులను ఎస్పీ మాధవరెడ్డి పుట్టపర్తిలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. 

క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ అన్నారు. ఆన్​లైన్ క్రికెట్​ బెట్టింగ్​కు ఆబ్రాడ్ నుంచి యూజర్ ఐడీ పాస్వర్డ్​లను చేరవేస్తున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ఆయన తెలిపారు. యాప్​ల పేరుతో మోసానికి పాల్పడుతున్నవారి పట్ల యువకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్​కు అడ్డుకట్ట వేసి తీరుతామని ఆయన అన్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. యువత క్రికెట్ బెట్టింగ్​కు దూరంగా ఉండాలని హితవు పలికారు. తల్లిదండ్రుల సైతం పిల్లలను గమనించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details