ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPS employees protest

ETV Bharat / videos

జగన్మోహన్ రెడ్డిని నమ్మితే చెవిలో పువ్వులు పెట్టాడు - గుండు కొట్టించుకుని నిరసన తెలిపిన సీపీఎస్ ఉద్యోగులు - అనకాపల్లి జిల్లా వీడియోలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 10:41 PM IST

CPS employees protest against YCP government:అనకాపల్లి జిల్లా కేంద్రంలో సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎస్ ఉద్యోగులు, వైసీపీ ప్రభుత్వ తమను మోసం చేసిందంటూ గుండు కొట్టించుకొని, చెవిలో పూలు పెట్టుకొని వినూత్నంగా నిరసనహ తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్ర సమయంలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.  కానీ, అదికారంలోకి వచ్చి నాలుగు సంత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇచ్చిన హామీని అమలు చేయకుండా  తమను మోసం చేశారని సీపీఎస్ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పే పార్టీకే మద్దతు ఇస్తామని సీపీఎస్ ఉద్యోగులు తెలిపారు. ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ  సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details