CPM Leaders Condolences to Asha Worker Kripamma Family : ఆశ కార్యకర్తల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి : సీపీఎం - గుంటూరు జిల్లా ఆశా వర్కర్ల వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 4:08 PM IST
CPM State Secretary visits Asha Worker Krupamma family : గుంటూరు జిల్లా తాడేపల్లిలో మృతి చెందిన ఆశ కార్యకర్త కృపమ్మ కుటుంబ సభ్యులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పరామర్శించారు. బాధిత కుటుంబానికి సహాయంగా ప్రభుత్వం రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆరోపించారు. వీరి జీవితాలకి భద్రత లేకుండా చేసిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆశ కార్యకర్తలు చనిపోతే.. దిక్కులేని వారిగా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆశ కార్యకర్తల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భదత్ర కల్పించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉండగా కృపమ్మ చనిపోతే ప్రభుత్వం వారి కుబుంబాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆశ యూనియన్ నాయకులు సహాయం చేయటానికి ముందుకు వస్తే ప్రభుత్వం వారిని అరెస్టు చేసిందని చెప్పారు. ప్రజలందరూ యూనియన్ నాయకులకు అండగా నిలబడటం వల్ల ప్రభుత్వం దిగివచ్చి రూ. 10 లక్షల సహాయం ప్రకటించిందని తెలిపారు. కృపమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.