ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మోదీ రాష్ట్రానికి ఏమి చేశారని పవన్ మద్దతు ఇచ్చారు: శ్రీనివాసరావు

ETV Bharat / videos

Srinivasa Rao on NDA meeting: మోదీ రాష్ట్రానికి ఏం చేశారని పవన్ మద్దతిచ్చారు: శ్రీనివాసరావు - BJP promises to AP

By

Published : Jul 19, 2023, 5:58 PM IST

 Srinivasa Rao comments on the NDA meeting: దేశంలో రాజకీయ మార్పులు ప్రారంభం కానున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోదీ ఓటమి భయంతో అత్యవసరంగా ఎన్డీఏ సమావేశం పెట్టారని విమర్శించారు. మోదీ వల్ల దేశానికి ఏ మంచి జరిగిందో  చెప్పాలని ఆరోపించారు. ఎన్డీఏ కూటమిలో 14 పార్టీలకు మాత్రమే చట్ట సభల్లో ప్రాధాన్యత ఉందని ఆరోపించారు. అలాగే మన రాష్ట్రం నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారని అన్నారు. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏవి అమలు చేశారని పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై ఆయన రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా, పోలవరంపై టీడీపీ, వైసీపీ గళమెత్తాలన్నారు. టీడీపీ, వైసీపీ జనసేనలను బీజేపీ ఆడిస్తుందని ధ్వజమెత్తారు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో టీడీపీ, వైసీపీ విధానం ఏమిటో‌ చెప్పాలని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తే పార్టీలకు మాత్రమే ప్రజలు పట్టం కట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details