ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ETV Bharat / videos

CPM Srinivasa Rao వాలంటీర్లను రాజకీయ వాలంటీర్లుగా వాడుకుంటున్నారు:సీపీఎం శ్రీనివాసరావు - CPM Srinivasa Rao on Polavaram

By

Published : Jul 15, 2023, 2:16 PM IST

CPM State Secretary Srinivasa Rao: వాలంటీర్ వ్యవస్థపై వివాదం తగదని వారిని రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధంగా వినియోగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హితవు పలికారు. వాలంటీర్‌ వ్యవస్థను పంచాయతీల పరిధిలోకి తీసుకుని రావాలని.. అవి పూర్తిగా పంచాయతీల ఆధీనంలోనే ఉండాలన్నారు. అమరావతి నుంచి సచివాలయాల వరకు వైసీపీ నాయకులు పెత్తనం చెలయిస్తారా అని మండిపడ్డారు. వాలంటీర్లను రాజకీయ వాలంటీర్లుగా వాడుకుంటున్నారని అన్నారు. సంక్షేమ వాలంటీర్ల అవతారలను మార్చి ఓట్లు వేయించే మిషన్ల లాగా వాలంటీర్లను మారుస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్​ సమావేశాల జరిగుతున్న నేపథ్యంలో.. పోలవరం సమస్యలపై దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సన నిధులను రాబట్టలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 8 వేల కోట్ల రూపాయలను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details