CPM State Secretary Srinivasa Rao is Fires on CM Jagan: కరవుతో రైతులు అల్లాడుతుంటే సీఎం విహార యాత్రలా: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 5:39 PM IST
CPM State Secretary Srinivasa Rao is Fires on CM Jagan: రాష్ట్రంలో కరవుతో రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి విహార యాత్రలు చేస్తున్నారు, అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మండిపడ్డారు. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు. ఇరిగేషన్ శాఖా మంత్రి బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నీరు, విద్యుత్ ఇవ్వకపొతే పంటలు రైతులు పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లలో ప్రైమ్ 2.0 అని కొత్త విధానం తీసుకువచ్చి స్థలాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం తన దగ్గరే పెట్టుకుంటామని చెప్పడం సరి కాదన్నారు. ప్రభుత్వ విద్యను దెబ్బ తీసేలా.. ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 56 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. తమ పార్టీ విస్తృత సమావేశాల్లో రాష్ట్రంలోని అంశాలపై చర్చించామన్నారు. త్వరలో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రజల్లోకి వెళ్తామన్నారు.