ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_land_scams

ETV Bharat / videos

CPM Srinivasa Rao Demands on Prakasham district Land Scams ఒంగోలు భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: సీపీఎం శ్రీనివాసరావు - CPM State Secretary V Srinivasa Rao

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 3:40 PM IST

CPM Srinivasa Rao Demands to Inquiry on Land Scams:ప్రకాశం జిల్లాలో జరిగిన భూకుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఈ రోజు ఒంగోలులో సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ భూకంభకోణం గతంలో జరిగిన తెల్గీ కుంభకోణం లాగా ఉందని దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇటీవల పూంగునూరులో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఉత్తరాంధ్ర నుంచి సైకిల్​ యాత్ర చేస్తూ అక్కడకు వచ్చే సరికి వైసీపీ నాయకులు వారిపై చేసిన దాడి విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని.. ఇలా దాడి చేసి బెదిరించడం అమానుషమని అన్నారు. ఎక్కడపడితే అక్కడ నిర్బంధాలు విధించడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాటిలో కరువు మండలాలు ప్రకటించి ఎకరాకు 25 వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details