ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cpi_senior_leader_narayana

ETV Bharat / videos

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం వైఎస్సార్​సీపీకి బస్మాసుర హస్తం అవుతుంది: సీపీఐ నారాయణ - వైఎస్సార్​సీపీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 7:55 PM IST

CPI Senior Leader Narayana: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జైలులో ఎక్కువకాలం గడిపిన వ్యక్తి ముఖ్యమంత్రి జగనేనని  సీపీఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీలు అడిగితే ఎస్మా ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. మున్సిపల్​ కార్మికులే ఔదార్యంతో వ్యవహరించారని ప్రభుత్వం అలా వ్యవహరించలేదని విమర్శించారు. అంగన్వాడీలపై ఎస్మా చివరికి వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ తలపైనే బస్మాసురు హస్తమవుతుందని హెచ్చరించారు. 

వైఎస్సార్​సీపీ​ ప్రభుత్వానికి ఎవరైనా ఎదురుతిరిగితే వారిపై కేసులు పెడ్తు, జైళుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబును సైతం జైలులో పెట్టారన్నారు. ఈ ప్రభుత్వం జైలులో పెట్టడం తప్పితే మరేమి చేయలేదని వివరించారు.  రానున్న ఎన్నికల దృష్ట్యా పొత్తులపై స్పందిస్తూ, ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నట్లు వివరించారు. అందువల్లే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీతో కలిసివెళ్తున్నామని వివరించారు. భ్యవిష్యత్​లో బీజేపీకి వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details