ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Roundtable Meeting on Crimes Against the Dalits

ETV Bharat / videos

CPI Roundtable Meeting on Crimes Against the Dalits: వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది: సీపీఐ రామకృష్ణ - cpi roundtable meeting at amalapuram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 9:26 PM IST

CPI Roundtable Meeting on Crimes Against the Dalits: రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్​కు చీమకుట్టినట్టు కూడా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ఖండిస్తూ... కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులోని కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం(Round table meeting) నిర్వహించారు.  విశాఖలో డాక్టర్ సుధాకర్ మరణంతో  మొదలుకొని ఇంతవరకు జరిగిన అనేక దళితుల హత్యలు, అత్యాచారాలు, దాడులు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో దళితులు, ఇతర వర్గాల వారి మద్ధత్తుతోనే వైసీపీకి అంతలా సీట్లు వచ్చాయని పేర్కొన్నారు.  విశాఖలో డాక్టర్ సుధాకర్ ప్రశ్నించినందుకే అతన్ని పిచ్చివాడిగా ముద్రవేసి చనిపోయే వరకు వదిలిపెట్టలేదని విమర్శించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ(Door delivery) చేసిన ఎమ్మెల్సీకి  సన్మానం చేస్తూ... దండలు వేసి ఊరేగించే సంసృతిని తీసుకువచ్చారని పేర్కొన్నారు. దళితుడికి పోలీస్ స్టేషన్​లో శిరోముండనం చేసిన అంశాలను గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్... దాడులపై స్పందించడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details