ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

CPI Ramakrishna on Pawan Kalyan వైసీపీని ఓడించేందుకు పవన్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం.. కానీ : సీపీఐ రామకృష్ణ - Pawan Kalyan Comments

🎬 Watch Now: Feature Video

CPI_Ramakrishna_on_Pawan_Kalyan_Comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 9:10 PM IST

Updated : Oct 7, 2023, 9:40 PM IST

CPI Ramakrishna on Pawan Kalyan Comments: 2024లో వైఎస్సార్సీపీని ఓడించేందుకు ఏ పార్టీ ముందుకొచ్చిన తాము స్వాగతిస్తామన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. వైసీపీని ఓడించేందుకు పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సీర్సీపీని ఓడించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ, బీజేపీని కూడా పవన్‌ ఆహ్వానించడాన్ని తాము విభేదిస్తున్నామన్నారు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైసీపీ అరాచక పాలన సాగిస్తుందని రామకృష్ణ విమర్శించారు.

Ramakrishna Comments: విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ''రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీని ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తామన్న పవన్ కల్యాణ్‌తో ఏకీభవిస్తున్నాం. కానీ, ఒక విషయంలో మాత్రం విభేదిస్తున్నాం..అదేమిటంటే.. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలకు కేంద్రం సహకరిస్తుంది. మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని నిలివేసినా, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా, విధ్వంసక పోలీస్ రాజ్యం నడిపిస్తున్నా.. వైసీపీకి బీజేపీ పూర్తిగా సహకరిస్తుంది. ఈ విషయాన్ని జనసేన నేతలు త్వరలోనే తెలుసుకుంటారు.'' అని ఆయన అన్నారు.

Last Updated : Oct 7, 2023, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details