తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను తీసుకువచ్చింది: రామకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 1:51 PM IST
|Updated : Nov 1, 2023, 2:59 PM IST
CPI Ramakrishna on Krishna water Gazette Notification: ఏపీకి అన్యాయం చేస్తూ కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ను నిరసిస్తూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రానికి చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ మండిపడ్డారు.
"ఏపీకి అన్యాయం చేస్తూ కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను తీసుకువచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలకు బీజేపీ తెరలేపింది. రాష్ట్రానికి చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి