ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cpi_ramakrishna_fired_on_cm_jagan

ETV Bharat / videos

"గ్రామాలు వలసలు పోతుంటే సంక్రాంతి చేసుకోవాలని సీఎం ప్రకటనలిస్తున్నారు" - CPI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 2:13 PM IST

Updated : Jan 13, 2024, 5:43 PM IST

CPI Ramakrishna Fired on CM Jagan: రాష్ట్రంలోని గ్రామాలన్నీ వలసలు పోతుంటే అందరూ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని సీఎం జగన్​ పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పొట్ట చేత పట్టుకుని గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలు, నగరాల బాట పట్టి పెద్దఎత్తున వలసలు పోతున్నారని, అది ముఖ్యమంత్రికి కనిపించదా? అని ప్రశ్నించారు. తీవ్రమైన కరవుతో రైతులు నష్టపోయారని, సీఎం రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేరని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలోని 460 మండలాల్లో కరువు తలెత్తిందని, కానీ, ప్రభుత్వం మాత్రం సుమారు 103 మండాలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరవుపై కేంద్ర ప్రభుత్వానికి సరైన నివేదిక అందించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని, ప్రభుత్వ పాఠశాలల నుంచి అందరూ ప్రైవేట్ స్కూళ్లకు పోతుంటే అంతా బాగుందని చెబుతున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోరని, ఇచ్చిన మాట తప్పినవారే దుర్మార్గంగా ఎస్మా ప్రయోగిస్తారా అంటూ రామకృష్ణ మండిపడ్డారు.  

Last Updated : Jan 13, 2024, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details