ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Ramakrishna Comments on CM YS Jagan

ETV Bharat / videos

CPI Ramakrishna Comments on CM YS Jagan: జగన్ రెడ్డి రివర్స్ పాలనలో.. రాష్ట్రం దివాలా: సీపీఐ రామకృష్ణ - కళ్యాణదుర్గంలో సీపీఐ బస్సు యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 7:22 PM IST

CPI Ramakrishna Comments on CM YS Jagan: జగన్​ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ చేపడుతున్న బస్సు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న రివర్స్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ నెలకొల్పలేదని,.. రోడ్లు వేయలేదని, సాగునీటి ప్రాజెక్టులకు అసలే ప్రాధాన్యత లేదని జీతాలు ఇవ్వాలంటే అప్పులు తీసుకొచ్చి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రిని, కేంద్రంలో ప్రధానమంత్రిని గద్దె దింపి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details