ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Party State Assistant Secretary Muppalla On Pention

ETV Bharat / videos

సీఎం జగన్​ ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల పెన్షన్లు పెంచాలి: ముప్పాళ్ల నాగేశ్వరరావు - విజయవాడ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 7:37 PM IST

CPI Party State Assistant Secretary Muppalla On Pention :  ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల సామాజిక పెన్షన్లు పెంచాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నేతలు డిమాండ్​ చేశారు. నవంబర్ 10వ తేదీన విజయవాడ హనుమంతరాయ గ్రంధాలయంలో రాష్ట్ర స్థాయి పెన్షనర్ల సదస్సు నిర్వహిస్తున్నామని  సీపీఐ  పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ దాసరి భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో పెన్షనర్ల సదస్సుకు సంబంధించిన కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. 

Muppalla Fires on YCP Government in Vijayawada : ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలకు 5వేలకు పెన్షన్ పెంచి ఇస్తామన్న హామీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది సామాజిక పెన్షనర్లు ఉన్నారన్నారు. వారికి ఆరోగ్య భద్రత లేదని,.. రాష్ట్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్లతో రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో అర్జీలు పెట్టిస్తామన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పెన్షన్ల అంశంపై తమ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details