ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Narayana

ETV Bharat / videos

Narayana Fire On YSRCP: పార్టీ పొత్తులపై సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..! - CPI Narayana comments

By

Published : Jul 24, 2023, 10:37 PM IST

CPI Narayana sensational comments on CM Jagan: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లలో రాష్ట్రం అభివృద్ధి జరగకపోగా.. అరాచకాలు, దౌర్జన్యాలు, ఇసుక మాఫియా విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. ఏపీలో వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అభివృద్ధి చెందారే తప్ప.. రాష్ట్రం అభివృద్ది చెందలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. తమ పార్టీ మద్దతు ఎవరికీ ఉంటుందనేది త్వరలోనే వెల్లడిస్తామని నారాయణ వ్యాఖ్యానించారు.

త్వరలోనే మా నిర్ణయాన్ని తెలియజేస్తాం.. తిరుపతి రూరల్ తిరుచానూరు గ్రామ పంచాయితీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఏబీ బర్ధన్ కమ్యూనిటీ భవనాన్ని సోమవారం సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''సీఎం జగన్ బీజేపీతోనే కలిసి ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. జగన్ పాలనలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బాగా అభివృద్ధి చెందారే తప్ప.. ఆంధ్ర రాష్ట్రం మాత్రం అభివృద్ధి కాలేదు. రాయలసీమ అభివృద్ధికి యాభై కోట్లు ఇస్తానన్న కేంద్రం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసింది. బీజేపీతో కలిసి పోటీ చేయాలని చూస్తోన్న.. పవన్, చంద్రబాబులు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో కలిసి ఉండాలని ఎవరు ప్రయత్నం చేసినా.. వారు ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్లే అవుతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే.. మా పార్టీ ఎవరికీ మద్దతివ్వాలి అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించి మా నిర్ణయాన్ని తెలియజేస్తాము'' అని నారాయణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details