ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Narayana demands

ETV Bharat / videos

తెలంగాణలో కోరుకున్నట్లే ఏపీలో మార్పు తప్పదు: సీపీఐ నారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 3:57 PM IST

CPI Narayan allegations against CM Jagan: మిగ్​జాం తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగ్​జాం తుపాను  (Michaung Cyclone) బాధితులతో మాట్లాడకుండా హెలికాప్టర్​లో తిరిగే ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం మనుషులను నిర్భందించటం, చెట్లు కొట్టేయటం పాపమన్నారు.  రాష్ట్రాభివృద్ది కోసం అఖిలపక్షంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకవచ్చి, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. 

ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని, జగన్​పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. తనపై ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై రుద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని  నారాయణ  విమర్శించారు. వైసీపీలో సీఎం అభ్యర్థిగా జగన్​ను మారిస్తే పరిస్థితి కొంతైనా మారవచ్చన్నారు. తెలంగాణలో మార్పు కోరుకున్నట్లే ఆంధ్రప్రదేశ్​లోనూ మార్పు తప్పదన్నారు. జగన్ పాలనలో అహంకారం, నియంతృత్వం, అవినీతి పెరిగి పోయిందని  నారాయణ ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details