CPI Leaders Arrested రైతు సంక్షేమంపై సీఎం అబద్దాలు చెప్పారు.. సభా స్థలం వద్ద నిరసనకు దిగిన సీపీఐ - సీఎం సభా స్థలాన్ని క్లీన్ చేసిన సీపీఐ నేతలు
CPI Leaders Cleaned CM Jagan Meeting Place: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి పర్యటించిన బహిరంగ సభ ప్రదేశాన్ని సీపీఐ నాయకులు శుద్ధి చేశారు. సీఎం జగన్, మంత్రి ఉషశ్రీ చరణ్ అబద్దాలు చెప్పి.. సభను కలుషితం చేశారని మండిపడ్డారు. సభా ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ నాయకులను పోలీసులు వాహనాలు ఎక్కించి స్టేషన్కు తరలించారు. రైతులను ఆదుకున్నామని అబద్దాలు చెప్పి సీఎం జగన్ తన హోదాను తగ్గించుకున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో జరిపింది.. రైతు దినోత్సవం కాదని, రైతు విద్రోహ దినం అని సీపీఐ నాయకులు అన్నారు.
రైతులకు తీవ్ర అన్యాయం చేసిన సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అన్నారు. సీఎం జగన్ పర్యటన వల్ల జిల్లాకు జరిగిన ప్రయోజనం ఏంటని నిలదీశారు. పైగా జిల్లాలో రైతులంతా సంతోషంగా ఉన్నారని పంటలు పండించుకుంటూ అంతా పచ్చగా ఉందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి సీఎం జగన్ వాస్తవాల్లోకి రావాలన్నారు.