ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cpi_leader_ramakrsihana_support_to_anganwadi

ETV Bharat / videos

సీఎం జగన్​కు బుద్ధి చెప్పేందుకు అంగన్​వాడీలు సిద్ధం : సీపీఐ రామకృష్ణ - అంగన్వాడీల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 7:50 PM IST

CPI Leader Ramakrsihana Support to Anganwadi : పేదల ప్రభుత్వమని గొప్పలకు పోయే సీఎం జగన్​, పేదవాళ్లు జీతాలు పెంచాలని రోడ్డుపైకి వస్తే ఎందుకు స్పందిచడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కర్నూలులో అంగన్వాడీల దీక్ష శిభిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. పేదల పక్షాన వైసీపీ ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. 

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. అంతేకాకుండా పోలీసులకు అంగన్వాడీలకు ప్రభుత్వం తగదాలు పెడ్తోందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను ముఖ్యమంత్రి పగలకొట్టించారని, మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డికి అంగన్వాడీ సిబ్బంది తగిన బుద్ది చెప్తారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా వైసీపీకి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details