CPI Leader Ramakrishna on Beach Sand Mining బీచ్ శాండ్ మైనింగ్‌లో జగన్‌కు కమిషన్.. ఆ సొమ్ముతో ఎన్నికలకు సిద్దమైన వైసీపీ: రామకృష్ణ - విజయవాడ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 12:54 PM IST
CPI Leader Ramakrishna Fire on YSRCP Government :బీచ్ శాండ్ మైనింగ్‌పై (Beach Sand Mining) ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ చేసేందుకు సిద్ధమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అదానీని రహస్యంగా కలిసిన మరుసటి రోజే మైనింగ్కి సంబంధించి బిడ్డింగ్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంపై అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే విశాఖలో భూములను ఆదానీకి అప్పగించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మేనేజ్ చేసి వేల కోట్లు విలువైన బీచ్ శాండ్ మైనింగ్‌ను ఆదానీకి కమిషన్ కోసం కక్కుర్తి పడి అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను ఇప్పటికే అదానీకి అప్పగించిన వైసీపీ ప్రభుత్వం తాజాగా శాండ్ మైనింగ్ కూడా అప్పగింస్తుందని, దానిపై వచ్చే కమిషన్‌తో ఎన్నికలకు సిద్ధవుతున్నారని ఆయన పేర్కొన్నారు. బీచ్ శాండ్ మైనింగ్‌పై ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ రామకృష్ణ చేశారు.