ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Leader Narayana Punches on CM Jagan

ETV Bharat / videos

CPI Narayana: 'మూడు పెళ్లిళ్ల కంటే.. బాబాయి హత్య ప్రమాదకరం కాదా?' జగన్​​కు రాజకీయంగా పస లేకనే పవన్​పై కామెంట్లు.. - CPI Leader Narayana Punches on CM Jagan

By

Published : Jul 26, 2023, 5:04 PM IST

CPI Leader Narayana Punches on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​పై సీపీఐ నేత నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్.. ఇటీవల ఏ సభకు వెళ్లినా పవన్​ కల్యాణ్​పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్​పై సెటైర్లు వేశారు నారాయణ. సీఎం జగన్​ మోహన్ రెడ్డి తరచూ పెళ్లాల గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు పెళ్లిళ్లు తప్పు అని అంటున్న జగన్​.. బాబాయిని హత్య చేయడం‌ తప్పు కాదా అని ప్రశ్నించారు. హత్యలు ప్రమాదమా.. మూడు పెళ్లిళ్లు ప్రమాదమా అనేది తేల్చాలన్నారు. బాబాయిని చంపడం తప్పు కాదని చెబుతారా అని దుయ్యబట్టారు. పవన్​ విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్​కు ఇబ్బంది ఏమిటని నారాయణ ప్రశ్నించారు. సీఎం‌ తన హోదాను మరచి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయ పరమైన అంశాలతో ఎవరినైనా విమర్శించవచ్చు కానీ తరచూ వ్యక్తిగత దూషణలతో నిందలు వేయడం ఏమిటని మండిపడ్డారు. రాజకీయంగా పస లేనందువల్లే జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details