ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీపీఐ నారాయణ

ETV Bharat / videos

CPI Narayana Comments: 'సీఎం జగన్ రాజీనామా చేయాలి.. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు' - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

By

Published : May 29, 2023, 4:50 PM IST

CPI Narayana Comments: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని.. తాను ఏం తప్పూ చేయలేదు అని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సీబీఐ, కోర్టుల విషయాలు జగన్​కు వ్యతిరేకంగా వచ్చినప్పుడు.. తనను కాపాడమని దిల్లీకి వెళ్తారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం దిల్లీకి వెళ్లింది కూడా అందుకే అని.. సీబీఐ నుంచి, కేసుల నుంచి రక్షించమని కోరడానికే అని విమర్శించారు. 

అవినాష్ రెడ్డి సంఘటనతో సీబీఐ తన పరువు తీసుకుందని విమర్శించారు. సీబీఐ మీద ప్రజలకు నమ్మకం పోతోందని తెలిపారు. వివేకాను హత్య చేసింది ఎవరో తెలిసినా కూడా సీబీఐ ఎందుకు ఏం చేయలేకపోతోందని అన్నారు. అవినాష్ రెడ్డిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అదే విధంగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును.. ప్రధాని మోదీ అవమానించారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details