CPI Leader Jagadish Fire On Sajjala : "సజ్జల నోరు అదుపులో పెట్టుకో.. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని నోరు పారేసుకోకు" - గుంతకల్లు వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 9:07 AM IST
CPI Leader Jagadish Fire On Sajjala : కమ్యూనిస్టులపై వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ తీవ్రంగా ఖండించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సజ్జల నోరు అదుపులో పెట్టుకో.. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని నోరు పారేసుకోకు.. అని అన్నారు. ఆదాని, బీజేపీలకు జగన్ అమ్ముడు పోయింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నతాధికారులు పోస్టులు కావాలంటే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నది నువ్వు కదా? అని మండిపడ్డారు. నీవా కమ్యూనిస్టులు ప్రశ్నించేది.. పేదల కోసం అణగారిన ప్రజల కోసం నిత్యం ప్రజలతో మమేకమై వారి హక్కుల కోసం తాము పురాణాలు సైతం పనంగా పెట్టి పోరాటం చేస్తున్నది మేము కాదా అన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ అక్రమాలు చేసి మీ ఆస్తులను రక్షించుకునేందుకు కొత్త పథకాలను తీసుకువచ్చి పేదలను మరింత పేదలుగా చేసినది మీ ప్రభుత్వం కాదా? అని దుయ్యబట్టారు. ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సజ్జల రామకృష్ణారెడ్డికి హెచ్చరించారు. రాజమండ్రి జైలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు సీపీఐ సంఘీభావం తెలుపుతూ తాము కూడా న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామన్న జగదీష్ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి టీడీపీతో కలిసి పని చేస్తామన్నారు.