'జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపడం ఖాయం' - 'ప్రజా సమస్యలతో సీఎం ఆటలాడుతున్నాడు' - CPM State Secretary Srinivasa Rao
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 4:07 PM IST
CPI 99th Anniversary In Vijayawada : జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. పరదాల చాటున సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
CPI State Secretary K. Ramakrishna Comments On State And Central Govt :విజయవాడలో నిర్వహించిన సీపీఐ 99 వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ అజెండాతో ముందుకెళ్తుందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు.
CPM State Secretary Srinivasa Rao : ప్రజా సమస్యలతో ముఖ్యమంత్రి జగన్ ఆటలాడుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ఆడుదాం ఆంధ్ర అంటూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేయడం దారుణమని ఆయన నెల్లూరులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ అహంకారాన్ని వీడి కళ్లు తెరవకుంటే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.