ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CP Kanthi Rana Tata

ETV Bharat / videos

శ్యామ్ కుమార్​పై దాడి ఘటనలో నిందితులు అరెస్ట్! 10 ఏళ్ల జైలు శిక్షపడే సెక్షన్లు నమోదు- కాంతిరాణా టాటా - Attack on Dalit in ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 10:32 PM IST

CP Kanthi Rana Tata: కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. 1వ తేదీ రాత్రి ఘటన జరిగిన వేంటనే సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం..  ద్వారా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు హరిష్ రెడ్డి సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు కాంతిరాణా టాటా పెర్కొన్నారు. గతంలో ఉన్న మనస్పర్దలే యువకుల మద్య గొడవకు కారణమని ఆయన వెల్లడించారు. కిడ్నాప్ , ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు, 363, 323, 326, 386, R/W 34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సెక్షన్స్ కింద 10 ఏళ్లవరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ , అట్రాసిటీ కేసుతో పాటు నాన్ బెయిల్ బుల్ సెక్షన్స్ నమోదు చేయడం జరిగిందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details