ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Road accident in Sri Sathya Sai district

ETV Bharat / videos

couple died in road accident : చికిత్స కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

By

Published : Aug 4, 2023, 1:31 PM IST

Road accident in Sri Sathya Sai district :చికిత్స కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. భర్తను ఆసుపత్రిలో చూపించేందుకు కారులో వెళుతుండగా జిల్లాలోని అగళి మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. కర్ణాటకకు చెందిన హనుమంతరాయప్ప, రాధమ్మ భార్య భర్తలు. హనుమంతరాయప్పకు ఆరోగ్యం సరిగా లేక గురువారం భార్య రాధమ్మ అతనిని సోదరుడు మంజునాథ్​తో కలిసి శిర ఆసుపత్రికి  కారులో తీసుకెళుతుండగా అగలి జాతీయ రహదారిలో ఎదురుగా కూరగాయల లోడ్​ తో వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రాధమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన హనుమంతరాయప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంజునాథ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో తుంకూర్​కు తరలించారు. టాటా ఏస్ వాహనం డ్రైవర్​ కలిముల్లాకు రెండు కాళ్లు విరిగాయి. మృతి చెందిన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details