2నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆత్మహత్య, అదే కారణమా? - suicide cases in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 12:18 PM IST
Couple Committed Suicide: సత్యసాయి జిల్లా రామగిరి మండలం గంగంపల్లి చెందిన ఓ యువ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన దాదా, జ్యోత్స్న రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లితో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. దాదా కుటుంబ సభ్యులను ఒప్పించి వారి ఇంటిలోనే వీరిద్దరూ ఉంటున్నారు. వ్యవసాయ తోట వద్దకు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరూ తిరిగిరాలేదు.
Husband and Wife Suicide Case: ఈ క్రమంలో చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవులుగా స్థానికులకు కనిపించారు. పెళ్లి అనంతరం ఏం జరిగిందో మనస్థాపానికి గురైన జంట ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువ జంట ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు.. ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.