Couple fraud: అధిక వడ్డీ ఆశ చూపి.. అందినకాడికి కాజేసి.. తీరా అడిగితే - Frauds in the name of high interest
Couple cheating in Jandrapet: అధిక వడ్డీ ఆశ చూపి.. అప్పులు తీసుకుని.. నిలువునా ముంచేశారు దంపతులు. నమ్మకంగా తమ వద్ద డబ్బులు తీసుకుని రూ 1.75 కోట్ల మేర మోసం చేశారంటూ.. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట వాసులు కోరుతూ.. చీరాల తహశీల్దార్ ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు.. జాండ్రపేటకు చెందిన రమేష్, అరుంధతి అనే వ్యక్తులు గ్రామంలోని కొంతమందికి అధిక వడ్డీ ఆశ చూపారు.. ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర అప్పులు తీసుకున్నారు.. అలా రూ 1.75 కోట్లు వరకు వసూలు చేశారు.. తీరా చెల్లించమని అడగ్గా.. తమ వద్ద లేవని ఉన్నప్పుడు ఇస్తామని అంటున్నారని బాధితులు వాపోయారు.. గట్టిగా నిలదీస్తే మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. దిక్కున్నోళ్లకు చెప్పుకొండని అంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.. తమను నిలువునా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని బాధితులు తహసీల్దార్‌ను ఆశ్రయించి వినతిపత్రాన్ని అందజేశారు.