Couple Brutally Murdered in AP: పాత కక్షలతో భార్యాభర్తల హత్య..! - భార్యభర్తల హత్య న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 4:51 PM IST
Couple Brutally Murdered in AP: కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ పాత కక్షల నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో భార్యా భర్తలను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం సమీపంలో వీరంకి వీరకృష్ణను హత్య చేయగా... నడిరోడ్డు పై అతని భార్య వరలక్ష్మిని అతి కిరాతకంగా నరికి చంపారు. హత్యపై సమాచారం తెలుసుకున్న కూచిపూడి పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాత కక్షలు నేపథ్యంలోనే జంట హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడించారు.
వీరకృష్ణకు అతడి తమ్ముడు గణేష్‌కు మధ్య గత కొంతకాలంగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2009లో అతడి తమ్ముడు గణేష్ హత్యకు గురయ్యాడు. తన తండ్రి హత్యకు కారణం పెదనాన్న అనే భావనతో అతని కుమారులు కక్షపెంచుకున్నారు. ఈ నేపథ్యంలో పాత ఆస్తి గొడవలు సద్దు మణగకపోవడంతో వీరకృష్ణ, వరలక్ష్మి లను తమ్ముడి కుమారులే హత్య చేసినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. వీరకృష్ణ, వరలక్ష్మీ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.