Couple Allegations on Police in Alluri District: 'పోలీసులు ఇంట్లోకి చొరబడి.. రక్తం వచ్చేలా కొట్టారు' - couple from addateegala Allegations on police
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 7:34 PM IST
Couple Allegations on Police in Alluri District: రక్షించాల్సిన పోలీసులే.. తమపై దాడి చేశారంటూ అల్లూరి జిల్లా అడ్డతీగలకు చెందిన దంపతులు వాపోయారు. తమని ఇంత హింసిస్తున్నా.. ఎమ్మెల్సీ అనంతబాబు అండ ఉండటంతో ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డతీగలకు చెందిన అడ్డాల వెంకటేశ్వరరావుకు ఓ స్థల వ్యవహారంలో కుటుంబ సభ్యులతో వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఆగస్టు 8వ తేదీన వాయిదాకి వెళ్లి వచ్చిన తమను.. కొందరు వ్యక్తులు చంపేస్తామని బెదించారని వెంకటేశ్వరరావు భార్య రాజేశ్వరి తెలిపారు.
గత నెల 9న 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. పదో తేదీన పోలీసులు ఆకస్మికంగా ఇంట్లోకి వచ్చి.. చుట్టుపక్కల వారు చూస్తుండగానే తలుపులు వేసి విచక్షణరహితంగా రక్తం వచ్చేలా కొట్టారని ఆరోపించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని.. పోలీసులు చుట్టుపక్కల వారిని బెదిరించారని వాపోయారు. దీంతో గత్యంతరం లేక రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటినుంచి ఇల్లు వదిలేసి వేరే ప్రాంతాలలో తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. తమ ఉమ్మడి ఆస్తిని ఏదో రకంగా కాజేసి.. తమను హత్య చేయడానికి యత్నిస్తున్నారని వాపోయారు.
TAGGED:
Couple Allegations on police