Counselling for Rowdy Sheeters: రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోకపోతే.. కఠిన చర్యలు: విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ - Vizag Crime News
Counseling for rowdy sheeters: విశాఖ పోలీసు గ్రౌండ్స్‌లో ఏ కేటగిరి రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ మీడియా సమావేశంలో తెలిపారు. సిటీలో ఉన్న మొత్తం 280 మంది ఏ-కేటగిరి రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్స్‌కు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రౌడీషీటర్లు నేరాలు చేస్తే వారి బెయిల్ రద్దు చేస్తామని సీపీ ప్రకటించారు. ఇంకా నేర ప్రవృత్తి ఉంటే పీడీ యాక్ట్ పెడతామని అన్నారు. ప్రతి రోజు పోలీస్ స్టషన్ పరిధిలో వారిని గమనిస్తున్నట్టు తెలిపారు. విశాఖలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయన్నారు. ఏడు నుంచి పదేళ్లలో వారి ప్రవర్తనలో మార్పు ఉంటే.. వారి మీద ఉన్న రౌడీ షీట్ తొలగిస్తామని తెలిపారు. ఒకవేళ వారు ప్రవర్తన మార్చుకోకుంటే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. నగర బహిష్కరణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని.. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేయడం నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రతీ ఆదివారం కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.