ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Councilors Protested locked Municipal Commissioner office

ETV Bharat / videos

ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ను కార్యాలయంలో నిర్బంధించిన కౌన్సిలర్లు - latest news on Atmakuru Municipal Commissioner

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 10:43 PM IST

Councilors Protested locked Municipal Commissioner office: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ తీరును నిలదీస్తూ… 16 మంది కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయంలో నిర్బంధించి వాగ్వాదానికి దిగారు. గత కొద్ది రోజులుగా కమిషనర్‌ తమ వార్డులలో సమస్యలు, అనుమతుల విషయంలో ఇష్టం వచ్చినట్లుగా... వ్యవహరిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. అనంతరం కమిషనర్ రూముకు తలుపులు వేసి అతనిని నిర్బంధించి నిలదీశారు. ఇటీవల గ్రామాల్లో జరుగుతున్న.. పలు నిర్మాణాలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రశ్నించగా.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మీడియా ప్రతినిధులు వచ్చిన విషయం తెలుసుకొని వైస్ చైర్మన్​తో పాటు 12 మంది కౌన్సిలర్లు అక్కడి నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులు వారిని వివరణ కోరే ప్రయత్నం చేయగా... తమ అంతర్గత వ్యవహారం అని ఏమీ లేదంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. కనుషనర్​ను కార్యాలయంలో నిర్బంధించిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details