Controversy Over Park Name Changed as YSR: దేవుడి పేరుతో ఉన్న పార్కు పేరు మార్పు.. స్థానికుల ఆగ్రహం - Park Name Changed as YSR
Controversy over Park Name Changed as YSR: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రముఖ నిర్మాణాల పేర్లను మారుస్తూ వస్తోంది. దీనిపై అనేక విమర్శలు వస్తున్నా.. వెనకడుగు వేయడం లేదు. ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నా.. పట్టించుకోవడం లేదు. తాజాగా గుంటూరులో ఓ పార్కు పేరు మార్పు వ్యవహారం వివాదానికి దారి తీసింది. రాష్ట్రంలో చాలా సంస్థలకు పాతపేర్లు తీసేసి వైఎస్సాఆర్ పేరు పెడుతున్న ప్రభుత్వం.. సీతారాముల పేరిట ఏర్పాటైన పార్కు పేరు మార్చేసింది. శ్రీరాముడి ఆలయ భూమిలో ఏర్పాటైన పార్కు పేరు మార్చడంపై ప్రజలు మండిపడుతున్నారు. పేరు మార్పును నిరసిస్తూ ఆందోళనకు దిగిన స్థానికులకు తెలుగుదేశం నాయకులు మద్దతు తెలిపారు. పరిపాలన చేతకాని ప్రభుత్వం.. పేర్ల మార్పుపై పడిందని మండిపడ్డారు. సీతారాముల భూములలో ఉన్న పార్కు పేరు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్కు పేరు మార్పు వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు.