ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Controversy_Over_Machu_Collection_in_Guntur_Mirchi_Yard

ETV Bharat / videos

'మచ్చు' నిషేధంపై కూలీలు, గుమాస్తాల ఆందోళన - ఘాటెక్కిన గుంటూరు మిర్చి యార్డు - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 4:57 PM IST

Controversy Over Machu Collection in Guntur Mirchi Yard :గుంటూరు మిర్చి యార్డులో మచ్చు సేకరణపై నిషేధం విధించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. రైతులు తెచ్చిన మిర్చి బస్తాల్లో.. శాంపిల్కోసమంటూ కూలీలు మచ్చు సేకరిస్తారు. అయితే మచ్చును తీసుకోవడం వల్ల అన్నదాతలకు నష్టం జరుగుతోందనే ఆలోచనతో మిర్చియార్డు పాలకవర్గం, అధికారులు నిషేధిస్తూ తీర్మానం చేశారు. కూలీకి అదనంగా కిలోలకు కిలోలు మిర్చిని మచ్చు కోసం తీసుకెళ్లటం సరికాదంటూ ఆంక్షలు పెట్టారు. మచ్చును సేకరించటం వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్న ఉద్ధేశంతోనే.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాలకవర్గం తెలిపింది.

అయితే, మచ్చు నిషేధంపై మిర్చియార్డులో పనిచేసే కూలీలు ఆందోళనకు దిగారు. మచ్చుపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. యార్డు ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ కార్యాలయం వద్ద కూలీలు, గుమస్తాలు నినాదాలు చేశారు. ఛైర్మన్ ను కారులో నుంచి దిగనీయకుండా ముట్టడించారు. మిరపకాయల్ని ఛైర్మన్ ఛాంబర్ ఎదుట పోసి నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి మచ్చు సేకరిస్తుంటే ఎలా నిషేధిస్తారని కూలీలు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details