ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Murder

ETV Bharat / videos

Whatsapp status Murder ప్రాణం తీసిన వాట్సప్ స్టేటస్ వివాదం.. - పవన్ కళ్యాణ్ అభిమాని హత్య

By

Published : Apr 23, 2023, 9:24 AM IST

Whatsapp status Murder సెల్​ఫోన్ వాట్సప్ స్టేటస్ విషయంలో ఇద్దరి వ్యక్తుల మధ్య వచ్చిన వివాదం ఓ హత్యకు కారణం అయింది. ఈ వివాదంలో ఓ వ్యక్తి తోటి సహచరుడిని హత్య చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో చోటుచేసుకుంది. 

అసలు ఏం జరిగిందంటే..

ఏలూరు పట్టణానికి చెందిన ఇద్దరు పెయింటర్​లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే వ్యక్తి గృహానికి రంగులు వెయ్యటానికి మూడురోజుల క్రితం అత్తిలికి వచ్చారని పోలీసులు తెలిపారు. అయితే భవనానికి రంగులు వేస్తూ రాత్రి సమయంలో అక్కడే నిద్రిస్తున్నారుని, వీరిద్దరిలో ఒకరైన హరికుమార్.. ప్రభాస్ అభిమాని కావటంతో పాటు ఏలూరు ప్రభాస్ అభిమాన సంఘానికి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

హరికుమార్ తన వాట్సాప్ లో ప్రభాస్ వీడియోను స్టేటస్​గా పెట్టుకోగా.. కిషోర్ పవన్ కళ్యాణ్ అభిమాని కావటంతో పవన్ స్టేటస్ పెట్టుకోవాలని హరికుమార్​ను కోరినట్లు పోలీసులు వివరించారు. దీంతో ఇద్దరిమధ్య గొడవ జరగటంతో హరికుమార్ కోపోద్రిక్తుడై కర్రతో కిషోర్ తలపై బలంగా కొట్టడమే కాకుండా.. సిమెంటు రాయితో ముఖం మీద కొట్టాడని.. దీంతో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 

JAI BHEEM నోటీసుల అంశంపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తాం.. జైభీమ్ జడ శ్రావణ్‌కుమార్

Rare disease To Kavya అరుదైన వ్యాధితో అవస్థపడుతున్న బాలిక.. ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి

గూగుల్ CEO పిచాయ్​కు 1,850 కోట్లు.. ఉద్యోగుల కంటే 800 రెట్లు ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details