ఆంధ్రప్రదేశ్

andhra pradesh

controversy_caused_by_cell_phone

ETV Bharat / videos

స్నేహితుల మధ్య చిచ్చురేపిన 'సెల్​ఫోన్ తాకట్టు' - ఘర్షణలో యువకుడు మృతి - సెల్ ఫోన్ కోసం మిత్రుడిని హత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 5:19 PM IST

Controversy Caused by Cell Phone : ఒక సెల్​ఫోన్ ఇద్దరు మిత్రుల మధ్య వివాదానికి కారణమైంది. ఈ వివాదంలో.. ఓ మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పూర్తి వివరాలివీ.. కృష్ణా జిల్లా గుడివాడలో రెడ్డి శ్రీను అనే వ్యక్తి తన స్నేహితుడు సతీష్ దగ్గర సెల్​ఫోన్​ను తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇస్తాను తన సెల్​ఫోన్ ఇవ్వాల్సిందిగా ఎన్ని సార్లు కోరినా సతీష్ స్పందించకపోవడంతో.. రెడ్డి శ్రీను గొడవ పెట్టుకున్నాడు. అది కాస్తా పెద్దదై.. రెడ్డి శ్రీను, సతీష్​పై చేయి చేసుకోవడంతో అతడు అక్కడికక్కడే నేలకొరిగాడు. 

ఘటన సమయంలో అక్కడే ఉన్న మరికొందరు మిత్రులు సతీష్​ను గుడివాడ ఏరియా హాస్పిటల్​కు తరలించారు. వైద్యులు అతన్ని పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. సతీష్ మృతదేహం చూసి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details