ఆంధ్రప్రదేశ్

andhra pradesh

contractors_protest_in_vijayawada

ETV Bharat / videos

'ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి?' అధికారులపై న్యాయపోరాటానికి సిద్ధం : గుత్తేదారుల ఆందోళన - వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 2:20 PM IST

Contractors Protest In Vijayawada :పెండింగ్ బిల్లులు చెల్లించాలని గుత్తేదారుల పోరుబాట పట్టారు. విజయవాడ ధర్నా చౌక్‌లో 26 జిల్లాలకు చెందిన గుత్తేదారుల ఆందోళనకు దిగారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని.. బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుత్తేదారులు ధర్నా చేపట్టారు. పులివెందుల, డోన్ నియోజకవర్గాల్లోనే బిల్లుల చెల్లింపు సరికాదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Contractors Fires On YCP Government : వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల విషయంలో వివక్ష చూపుతోందన్నారు. అధికారులు అత్యుత్సాహంతో నిబంధనలకు విరుద్ధంగా... అయిన వాళ్లకైతే ఒకలా, పరాయి వాళ్లకైతే మరోలా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు మండిపడ్డారు. నిబంధనలు పాటించని అధికారులు న్యాయస్థానాల్లో పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదారుల పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. అధికారులు అస్మదీయ గుత్తేదారులకు బిల్లులు చెల్లింపు అంశంలో, భవిష్యత్తు బిల్లులకు సంబంధించిన గ్యారెంటీలు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. మూడు నెలల్లో ప్రభుత్వం మారితే రాబోయే ప్రభుత్వానికి సంబంధించిన గ్యారెంటీలు గుత్తేదారులకు ఏ విధంగా ఇస్తారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details