Contract Lecturers Agitation: మేమేం పాపం చేశాం జగనన్న: కాంట్రాక్ట్ లెక్చరర్స్ - నేటి వార్తలు
Contract lecturer concern: మేమేం పాపం చేశాం జగనన్న అంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2014 జూన్ నాటికి సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరినీ రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్లుగా సుమారు 14 సంవత్సరాలు అనుభవం ఉన్నవారు ఉన్నారని పేర్కొన్నారు. కేబినెట్ ఉపసంఘం సిఫార్సులు జూన్ 2వ తేదీ 2014 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి ఇప్పటిదాకా కొనసాగుతున్న వారికి మాత్రమే రెగ్యులరైజేషన్ వర్తింపజేయాలని నిబంధన విధించడం సరికాదన్నారు.
కేవలం ఒక్క కటాఫ్ నిబంధన వేలాదిమంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వలన కొందరికే లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఎక్కువ మందికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 2014 జూన్ నాటికి సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్ అందర్నీ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో విన్నవించినా.. స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.